భారతదేశం, ఏప్రిల్ 30 -- హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30: నవతరం ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్ 'ఇవానా జువెల్స్' భారతీయ లగ్జరీ జ్యువెలరీ రంగంలో తన వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజాగా హైదరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చింది. రాజ్‌భవన్‌ రోడ్‌లో కంపెనీ తన 11వ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. వృద్ధి వ్యూహంలో భాగంగా ఇవానా జువెల్స్ దక్షిణ భారత మార్కెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

నిర్వహణ సామర్థ్యాన్ని, బ్రాండ్ గుర్తింపును పెంచడానికి బెంగళూరుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనుంది. "సూరత్‌కు చెందిన ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యమే పునాదిగా ఇవానా జువెల్స్ వారసత్వ హస్తకళకు, ఆధునిక సాంకేతికతకు మధ్య ఉన్న అంతరాన్ని విజయవంతంగా భర్తీ చేస్తోంది" అని ఇవానా జువెల్స్ వ్యవస్థాపక సభ్యుడు, డైరెక్టర్ యోగిత్ జిందాల్ పేర్కొన్నారు.

డిజిట...