భారతదేశం, జూన్ 6 -- Hyderabad Police Operation Kavach :హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నగర పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నగర అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, అసాంఘిక శక్తులు, అనుమానితుల కదలికలకు ముందస్తుగానే చెక్ పెట్టేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి భారీ ఎత్తున 'ఆపరేషన్ కవచ్' తనిఖీలు చేపట్టారు. ఈ మెగా ఆపరేషన్‌లో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది ఒకేసారి రంగంలోకి దిగి నగరవ్యాప్తంగా కలకలం రేపారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కొనసాగిన ఈ సోదాల్లో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలను జల్లెడ పట్టారు.

ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను గుర్తిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర...