భారతదేశం, జూలై 13 -- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ) ఇంజినీరింగ్- సైన్స్ కోర్సులు అభ్యసిస్తున్న అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుంచి పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ డీఆర్​డీఓ ఇంటర్న్‌షిప్‌లు హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్​డీఎల్​)లో ఉంటాయి. డీఆర్​డీఎల్​ అనేది భారత సాయుధ దళాల కోసం క్షిపణి వ్యవస్థల రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధించి, అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన ప్రముఖ ప్రయోగశాల.

అద్భుతమైన విద్యా నేపథ్యం కలిగిన భారతీయ పౌరులు ఆరు నెలల పాటు ఉండే ఈ పెయిడ్ డీఆర్​డీఓ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంజినీరింగ్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజినీరింగ్/ఫిజికల్ సైన్స్ అభ్యసిస్తున్న...