భారతదేశం, జూలై 6 -- ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం కాబట్టి, ముందే ఆరోగ్య బీమా తీసుకోవడం తెలివైన పని. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కొన్నిసార్లు ఆర్థిక భారంగా అనిపించవచ్చు. కానీ మీ ప్రీమియంను తగ్గించుకుంటూనే, మీకు అవసరమైన కవరేజీని పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాము..

1. హై డిడక్టిబుల్ ప్లాన్‌ను ఎంచుకోండి

డిడక్టిబుల్ అంటే మీ బీమా కంపెనీ ఖర్చులు భరించడం ప్రారంభించడానికి ముందు మీరు చెల్లించాల్సిన మొత్తం. అధిక డిడక్టిబుల్‌ను ఎంచుకోవడం వల్ల మీ ప్రీమియం గణనీయంగా తగ్గుతుంది. అయితే, ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితి వస్తే డిడక్టిబుల్‌ను కవర్ చేయడానికి మీకు తగినంత పొదుపు ఉందని నిర్ధారించుకోండి. హెల్త్​ ఇన్సూరెన్స్​లో ఇది సాధారణ...