భారతదేశం, జూలై 26 -- అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులు, వలస వ్యవస్థపై కఠినంగా ఉంటున్న ట్రంప్​.. ఇప్పుడు హెచ్​1బీ వీసా ప్రోగ్రామ్​, యూఎస్​ పౌరసత్వం విషయంలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్​1బీ లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చడంతో పాటు యూఎస్​ సిటిజెన్​షిప్​ టెస్ట్​లో మార్పులు తీసుకురావాలని ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో కీలక వ్యాఖ్యలు చేశారు.

యూఎస్​సీఐఎస్​ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో గురువారం న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి అవసరమైన నేచురలైజేషన్ పరీక్షను మార్చాలని అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం, వలసదారులు 100 సివిల్​ ప్రశ్నలను అధ్యయనం చేసి, అందులో 10 ప్రశ్నలకు గాను ఆరింట...