భారతదేశం, ఆగస్టు 12 -- అమెరికా వీసాలకు సంబంధించి కీలకమైన మార్పు చోటుచేసుకుంది. హెచ్1బీ సహా ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు గతంలో ఉన్న పర్సనల్​ ఇంటర్వ్యూ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టింది ట్రంప్​ ప్రభుత్వం. ఈ మేరకు ఈ రూల్​ని తప్పనిసరి చేసింది.

ఈ కొత్త నిబంధన ప్రకారం.. సెప్టెంబర్ 2, 2025 నుంచి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా రెన్యూవల్ చేసుకోవాలనుకునేవారందరూ తమ సొంత దేశాల్లో తప్పనిసరిగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ మార్పు అమెరికాలోని టెక్ హబ్‌ అయిన సిలికాన్ వ్యాలీలోని కంపెనీలకు, అక్కడ పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.

యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్​) ప్రకారం.. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో 2021-2024 మధ్య కాలంలో హెచ్1బీ వీసా అనుమతులు అత్యధికంగా మంజూరయ...