భారతదేశం, జూలై 27 -- అమెరికాలోని హెచ్​1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే వారికి 60 రోజుల గ్రేస్​ పీరియడ్​ ఉంటుంది. ఈ 60రోజుల్లో సదరు హెచ్​1బీ వీసాదారులు నాన్​-ఇమ్మిగ్రెంట్​ స్టేటస్​ని మార్చుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపాధి అనుమతి పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా దీర్ఘకాలికంగా దేశంలో నివసించడానికి యజమానులను మార్చడానికి 'నోన్-ఫ్రివోలస్ పిటిషన్' సమర్పించడం వంటి అనేక చర్యలు చేపట్టవచ్చు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హయాంలో.. ఉద్యోగం కోల్పోయిన హెచ్​1బీ వీసాదారులకు 60రోజుల గ్రేస్​ పీరియడ్​లోనే నోటీస్​ టు అప్పియర్​ (ఎన్​టీఏ) అందుతున్నాయని తెలుస్తోంది.

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారిక వెబ్‌సైట్‌లో 'ఉద్యోగం ముగిసిన తర్వాత నాన్-ఇమ్మిగ్రెంట్ కార్మికులకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్​' అనే ప...