భారతదేశం, జూలై 27 -- ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన భారత కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కరెక్ట్ టైమ్ లో సెంచరీతో టీమ్ ను ఆదుకున్నాడు. మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు అయిదో రోజు (జులై 27) ఆటలో సూపర్ సెంచరీతో శుభ్‌మ‌న్ గిల్‌ టీమ్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు అసాధారణంగా పోరాడాడు. ఈ సెంచరీతో రికార్డు కూడా అందుకున్నాడు.

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు చివరి రోజు శుభ్‌మ‌న్ గిల్‌ సత్తాచాటాడు. నాలుగో రోజు పరుగులేకుండా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు పోరాడాడు. 0/2తో బ్యాటింగ్ కు దిగిన గిల్ బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా ఒత్తిడిలో ఉన్నప్పుడు అద్భుత సెంచరీ సాధించి భారత్ భారీ లోటును పూడ్చి మ్యాచ్...