భారతదేశం, డిసెంబర్ 18 -- ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ ఊచకోత కొనసాగుతోంది. ఈ మూవీ రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ప్రపంచంలోనే రెండో వీకెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది మూడో స్థానంలో నిలవడం విశేషం.

దురంధర్ తొలి రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. రోజులు గడుస్తున్నా కొద్దీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో 17 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు 158 కోట్ల రూపాయలు) సంపాదించింది. ఆ తర్వాత సోమవారం వచ్చింది. అయినా మూవీ వసూళ్లు మాత్రం తగ్గేదేలేదన్నట్లు సాగిపోయాయి.

తన రెండో వీకెండ్ లో ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా చేసిన స్పై థ్రిల్లర్ దురంధర్ తన కలెక్షన్లను మరింత పెంచుకుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించ...