Hyderabad, జూలై 13 -- 50 ఏళ్ల వయసులోను సూపర్ హాట్ హీరోయిన్ అనిపించుకుంటోంది బాలీవుడ్ గ్లామర్ బ్యూటి శిల్పా శెట్టి. యంగ్ హీరోయిన్స్‌కు సైతం పోటీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో 90స్ కాలంలో వెంకటేష్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి జత కట్టి ఆడింది.

ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత సౌత్ సినిమాలో నటిస్తోంది శిల్పా శెట్టి. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా కేడీ ది డెవిల్. కన్నడ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కన కేడీ ది డెవిల్ టీజర్ రిలీజ్ ఇటీవల జరిగింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కేడీ ది డెవిల్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శిల్పా శెట్టి మాట్లాడుతూ .. "హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో సినిమాను చేశాను. సాహసవీరుడు సాగర కన్య అని సినిమాను చేశాను. నా సినీ కె...