భారతదేశం, జనవరి 20 -- ధురంధర్ మూవీ రికార్డుల వేట ఆగడం లేదు. థియేటర్లలో రిలీజైన 46వ రోజు కూడా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది ధురంధర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ, తన మొత్తం ఆదాయాన్ని మరింత పెంచుకుంది.

డిసెంబర్ 5, 2025న థియేటర్లోల రిలీజైంది ధురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. ఈ మూవీ 46వ రోజు (జనవరి 19) ఇండియాలో రూ.0.82 కోట్లు వసూలు చేసింది. దీంతో ధురంధర్ నెట్ కలెక్షన్లు 831.4 కోట్లకు చేరాయి.

హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్లు సాధించిన మూవీగా అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 రికార్డును ధురంధర్ బ్రేక్ చ...