భారతదేశం, ఫిబ్రవరి 14 -- మన ఇతిహాసం 'రామాయణం'ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వెనుక ఉన్న బలమైన కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా బయటపెట్టాడు. హాలీవుడ్‌లో భారతీయ సంస్కృతికి సరైన గుర్తింపు లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ పుట్టిందని అతడు తెలిపాడు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'DNEG' అధినేత, నిర్మాత నమిత్ మల్హోత్రా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమని అతడు అన్నాడు. ఇటీవల జరిగిన 'ఈటీ నౌ' ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో తనకు ఎదుర...