Hyderabad, జూలై 17 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అతని భార్య అల్లు స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్‌లో సరదాగా గడిపాడు. అర్జున్, స్నేహా తమ వెకేషన్ స్నీక్ పీక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సమంత కూడా లైక్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం షూటింగులను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా గురువారం (జులై 17) అతడు తన ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫ్యామిలీ మొత్తం బ్లాక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న ఫొటోను షేర్ చేశాడు. బ్లాక్ హార్ట్ ఎమోజీలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తోపాటు స్నేహా తమ పిల్లలు అందరూ మోనోక్రోమ్‌లో నవ్వుతూ కనిపించారు.

స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మరికొన్ని ఫొటోలను ...