భారతదేశం, ఆగస్టు 20 -- బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి ఇప్పుడు కోలీవుడ్ లో డెబ్యూ చేయనుంది. రాఘవ లారెన్స్ కామెడీ హారర్ థ్రిల్లర్ 'కాంచన 4'తో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ కోలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నోరా ఫతేహి.

తమిళ సినిమాలోకి అడుగుపెట్టేందుకు హారర్ థ్రిల్లర్ కాంచన 4 తనకు సరైన ప్రాజెక్ట్ అని నోరా ఫతేహి పేర్కొంది. "నాకు కాంచన 4 ఆఫర్ వచ్చినప్పుడు తమిళ సినిమాలోకి అడుగుపెట్టడానికి ఇది సరైన ప్రాజెక్ట్ అని భావించా. ఫ్రాంచైజీకి ఇప్పటికే చాలా బలమైన వారసత్వం ఉంది. స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమైంది. నేను దానిలో భాగం కావాలని కోరుకున్నాను. మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ విజయం తర్వాత నేను మరొక కామెడీ మూవీ చేయాలని చూస్తున్న టైమ్ లో ఈ ఛాన్స్ వచ్చింది'' అని నోరా...