Hyderabad, సెప్టెంబర్ 15 -- క్రికెటర్ హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోవడం గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అతడు యూకే సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ లో ఉన్నాడని అన్నారు. కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఓ మోడల్, నటి అయిన మహీక శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని పుకార్లు వస్తున్నాయి. దీనికి ఓ బలమైన ప్రూఫ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

మహీక సెల్ఫీలలో ఒక దానిలో వెనుక ఒక అబ్బాయి కనిపించడంతో సోషల్ మీడియాలో అతను హార్దిక్ పాండ్యానే నెటిజన్లు తేల్చేస్తున్నారు. దీంతో హార్దిక్, మహీక మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి పుకార్లు మొదలయ్యాయి. మరొక సోషల్ మీడియా యూజర్ ఆమె పోస్ట్‌లలో హార్దిక్ జెర్సీ నెంబర్ అయిన 33 కనిపించడం వల్ల ఈ పుకార్లు మరింత పెరిగిపోయాయి.

హార్దిక్, మహీక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్...