భారతదేశం, డిసెంబర్ 26 -- నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూస్ సంపాదించిన ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ఏదో తెలుసా? ప్రస్తుతం ఈ సిరీస్ చివరి సీజన్ రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు 9 ఏళ్లలో ఏకంగా 120 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సిరీస్ పేరు స్ట్రేంజర్ థింగ్స్.

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హారర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సిరీస్ మొత్తం కలిపి 1.2 బిలియన్ల (120 కోట్ల) వ్యూస్ మార్కును దాటి నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన ఇంగ్లిష్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది.

ఈ వెబ్ సిరీస్‌ను 'డఫర్ బ్రదర్స్' సృష్టించారు. 1980వ దశకంలో సాగే ఈ కథ ప్రేక్షకులను అద్భుతమైన నోస్టాల్జియాను అందిస్తుంది. 2016, జులై 15న తొలి సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. మొత్...