భారతదేశం, ఆగస్టు 16 -- అమెజాన్ ప్రైమ్ వీడియో లో రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'అంధేరా' (Andhera) అదరగొడుతోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇలాంటి హారర్ థ్రిల్లర్లు ఇంకా ఉన్నాయి. ఓటీటీలో వణుకు పుట్టించే ఈ సిరీస్ లు, షోలపై ఓ లుక్కేయండి.

భయ్ అని కూడా పిలువబడే ఈ టిస్కా చోప్రా సిరీస్ అదిరిపోయే హారర్ థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుంది. సిలాస్పురా అనే కాల్పనిక గ్రామంలో మూఢనమ్మకాలు, సైన్స్ మధ్య సంఘర్షణను ఈ సిరీస్ అన్వేషిస్తుంది. మైనింగ్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఐఏఎస్ అధికారిణి అవని రౌత్ గ్రామానికి రావడం, ఆ స్థలం శాపగ్రస్తమైందని గ్రామ ప్రజలు నమ్మడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మైనింగ్ ఆపరేషన్ ప్రారంభం కాగానే వింత, భయానక విషయాలు బయటపడతాయి. హారర్, థ్రిల్లర్, మిస్టరీ మేళవింపుతో, ఫాంటసీ టచ్ తో దహాన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది జియోహాట్‌స్టార్‌లో ఉంది. ...