భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఓటీటీలో కన్నడ హారర్ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' (Su From So) అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను గొప్పగా ఎంగేజ్ చేస్తోంది. డిజిటల్ సినీ లవర్స్ ఆదరణను సొంతం చేసుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదిరే వ్యూస్ తో సాగిపోతోంది.

కన్నడ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సు ఫ్రమ్ సో మూవీ సెప్టెంబర్ 9న ఓటీటీలోకి అడుగుపెట్టింది. కేవలం రూ.5.5 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఓటీటీలో సు ఫ్రమ్ సో జోరు కొనసాగుతోంది. జియోహాట్‌స్టార్‌ లో ఈ మూవీ టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఇండియాలో టాప్-1ల...