భారతదేశం, ఆగస్టు 19 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న యాక్షన్ మోడ్ లోకి దిగింది. రొమాన్స్ తోనూ కవ్విస్తోంది. లిప్ కిస్ కూడా పెట్టేసింది. ఇదంతా ఆమె అప్ కమింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'థామా' కోసమే. ఈ బాలీవుడ్ సినిమా టీజర్ ఇవాళ (ఆగస్టు 19) రిలీజైంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ట్విస్ట్ లతో టీజర్ అదిరిపోయింది. ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

మాడాక్ ఫిల్మ్స్ చివరకు థామా టీజర్‌ను విడుదల చేసింది. ఒక గ్రిప్పింగ్ 'బ్లడీ లవ్ స్టోరీ'గా ప్రచారం చేస్తున్న ఈ టీజర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచింది. థామా టీజర్ మంగళవారం విడుదలైంది ఆయుష్మాన్ ఖురానా వాయిస్‌ ఓవర్‌తో ఇది ప్రారంభమైంది.

"నువ్వు నేను లేకుండా 100 సంవత్సరాలు జీవించగలవా?" అని అడుగుతాడు హీరో. దీనికి రష్మిక మందన్న వాయిస్ "ఒక్క క్షణం కూడా కాదు" అని సమాధానం ఇస్తుంది. వాళ్లు ఒకరినొకరు చూసుకుంటూ కనిపిస్తారు....