భారతదేశం, సెప్టెంబర్ 30 -- వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తన లెవల్ ను పెంచుకుంటూ పోతుంది రష్మిక మందన్న. 2025లో ఇప్పటికే ఛావా, సికందర్, కుబేర సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఆమె.. ఇప్పుడు థామా అంటూ హారర్ కామెడీ థ్రిల్లర్ తో రెడీ అయింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.

థామా టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ఇలా అన్ని రష్మిక మందన్న చూట్టే సాగుతున్నాయి. ఇందులో ఆమె పోస్టర్లు, స్టిల్స్, సాంగ్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. హీరోగా ఆయుష్మాన్ ఖురానా ఉన్నా థామా సినిమాపై రష్మిక మందన్న ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తాజాగా థామా సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హాట్ మూవ్స్ తో రష్మిక అదరగొట్టింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మంచి డ్యాన్సర్ కూడా. థామా నుంచి రిలీజైన 'తుమ్ మెరే నా హుయే' హిందీ వీడియో సాంగ్ లో అది మరోసారి ప్రూవ్ అయిం...