భారతదేశం, జూలై 28 -- క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం.. 'హరి హర వీర మల్లు: పార్ట్ 1-స్వోర్డ్ vs స్పిరిట్'. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్ తదితరులు నటించారు. ఇది గత గురువారం (జులై 24) థియేటర్లలో విడుదలైంది. అంతకంటే ముందు బుధవారం సాయంత్రం ప్రీమియర్‌లు జరిగాయి. చెత్త వీఎఫ్ఎక్స్, అనవసరమైన సన్నివేశాల కారణంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ట్వీక్డ్ వెర్షన్ ను తాజాగా రిలీజ్ చేశారరు.

హరి హర వీరమల్లును తిరిగి చూసిన అభిమానులు సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ చేశారని, క్లైమాక్స్ లో చాలా భాగాన్ని తొలగించారని గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల నుంచి చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు, మార్పులతో పవన్ కల్యాణ్ సినిమా ఇప్పుడు చాలా బాగుందని వ్యాఖ్యానించారు. ఈ పని మ...