భారతదేశం, జూలై 27 -- ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో విషాదకర సంఘటన చేటుచేసుకుంది. మాన్సా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

ఘటనాస్థలానికి పరుగులు తీసిన అధికారులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

హరిద్వార్​ ఆలయంలో తొక్కిసలాటకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా శ్రావణమాసం నేపథ్యంలో ఆదివారం ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది.

హరిద్వార్​ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఉత్తరాఖండ్​ సఎం పుష్కర్​ సింగ్​ ధామి స్పందించారు.

"ఎస్​డీఆర్​ఎఫ్​, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చపట్టాయి. నేను స్థానిక యంత్రాంగంతో మాట్లాడుతూనే ఉన్నాను. పరిస్థితిని సమీక్షిస్తున్నాము," అని సింగ్​ ఎక్స్​లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది....