Hyderabad, జూలై 20 -- తెలుగులో అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటిపుల్ హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సరసన చేసి అలరించింది. ఇక టాలీవుడ్ సినిమాలకు ఫుల్ గ్యాప్ ఇచ్చిన హన్సిక 2022 డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకుంది హన్సిక మోత్వానీ. ఆ సమయంలో హన్సిక సోహైల్ వివాహం పెద్ద హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరి పెళ్లిపై జియో హాట్‌స్టార్‌లో లవ్ షాదీ డ్రామా సిరీస్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది కూడా.

ఇదిలా ఉంటే, సుమారు హన్సిక రెండున్నరేళ్ల వైవాహిక బంధానికి చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. హన్సిక భర్త నుంచి విడాకులు తీసుకోబోతోందని బాలీవుడ్‌లో తెగ ప...