Hyderabad, అక్టోబర్ 6 -- తెలుగులో లేటెస్ట్‌గా వస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా అరి. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవై హార్ష, సురభి ప్రభావతి, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమానే అరి.

అరి మూవీకి పేపర్ బాయ్ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వం వహించారు. మొన్నటివరకు ప్రమోషన్స్ సైలెంట్‌గా చేసిన అరి సినిమాకు ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. అందుకు కారణం రీసెంట్‌గా రిలీజ్ అయిన అరి మూవీ ట్రైలర్. గూస్ బంప్స్ ఇచ్చే విజువల్స్, బీజీఎమ్‌తో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది అరి ట్రైలర్.

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ అరి సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. భూమి మీదకు శ్రీ కృష్ణుడు రావాలనుకున్నప్పుడు ఆయనతోపాటు ఆరుగురు దేవతలు కూడా వ...