భారతదేశం, ఆగస్టు 17 -- హనీమూన్‌కు వెళ్లిన సమయంలో భార్యకు నెలసరి (పీరియడ్స్) వచ్చిందన్న కోపంతో ఆమెను భర్త తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి చంపేయబోయిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడిన మహిళ భర్తతో పాటు అతని తల్లి, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

గోరఖ్‌పూర్ నగరానికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో 2023 మే 30న ఆమె వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో తన తండ్రి సుమారు రూ. 20 లక్షల నగదు, ఒక కారుతో పాటు మరో రూ. 40 లక్షల విలువైన లాంఛనాలు కట్నంగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. తమకు ఇచ్చే వస్తువులు అన్నీ బ్రాండెడ్ అయి ఉండాలని తన అత్తామాలు తేల్చిచెప్పినట్టు వెల్లడించింది.ే

వివాహం జరిగిన కొద్ది రోజులకే, అంటే 2023 జూన్ 2న మహిళ కాపురానికి దిల్లీ వెళ్లిం...