భారతదేశం, ఆగస్టు 20 -- ఎన్నికల్లో గెలిచి, ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). చాలా కాలంగా షూటింగ్ లో ఉండటం, ఇద్దరు డైరెక్టర్లు దీన్ని తెరకెక్కించడం తెలిసిందే. థియేటర్లో మిక్స్ డ్ టాక్ తో మోస్తారుగా ఆడిన ఈ పీరియాడిక్ డ్రామా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ నటించింది.

పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 20) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పీరియాడిక్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుధవారం రిలీజైంది. థియేటర్లో ఓ మోస్తారుగా ఆడిన పవన్ కల్యాణ్ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్లో రిలీజైంది. పవన...