భారతదేశం, ఆగస్టు 25 -- స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో కొత్త లాంచ్‌ల సందడి మొదలైంది. గూగుల్ ఇప్పటికే తన పిక్సెల్ 10 సిరీస్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో మరిన్ని ఎగ్జైటింగ్​ గ్యాడ్జెట్స్​ మార్కెట్​లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఐఫోన్‌లతో పాటు మరికొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లు యూజర్స్​ని పలకరించనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో విడుదల కానున్న ఫోన్‌ల వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐఫోన్ 17 సిరీస్..

సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 17 సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది! ఈసారి మొత్తం నాలుగు మోడళ్లు రానున్నాయి: ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ఎయిర్.

అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, ఐఫోన్​ 17 లాంచ్​ ఈవెంట్​ సెప్టెంబర్​ 9న అమెరికాలో జరుగుతుందని తెలుస్తోంది. దీని కోసం సంస్థ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

లీక్స్​ ప్రకారం.. ఈసార...