Hyderabad, అక్టోబర్ 6 -- హీరోయిన్‌గా శ్రుతి హాసన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రుతి హాసన్ మొదట్లో సింగర్‌గా తన గాత్రంతో అలరించింది. అనంతరం బాలీవుడ్ మూవీ లక్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. కానీ, ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది.

ఆ తర్వాత తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. చాలా కాలం గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, సింగం 3, క్రాక్ వంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ రేంజ్‌కు వెళ్లిపోయింది శ్రుతి హాసన్.

సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి అలరించింది శ్రుతి హాసన్. ది ఐ అనే ఇంగ్లీష్‌ మూవీతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి...