భారతదేశం, జూలై 28 -- ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దిమ్మతిరిగే షాకిచ్చాడు. మ్యాచ్ ను ముగించి, డ్రా చేసుకుందామన్న స్టోక్స్ ప్రతిపాదనను తిరస్కరించి బ్యాటింగ్ కొనసాగించాడు. మాంచెస్టర్ టెస్టులో అయిదో రోజు (జులై 27) ఆటలో ఇంకా 15 ఓవర్లు ఉన్నాయనగా.. జడేజా, సుందర్ సెంచరీలు అడ్డుకోవాలని స్టోక్స్ ప్లాన్ చేసినట్లుగా కనిపించింది. కానీ భారత ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు.

ఇంగ్లాండ్, టీమిండియా మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ లోటుతో వెనుకబడ్డ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా పుంజుకుంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) సూపర్ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి తప్పించారు. చివరి రోజు ఎలాగో డ్రా ఖాయమైన పరిస్థితుల్లో మ్యాచ్ ముగిద్దామ...