భారతదేశం, నవంబర్ 16 -- టాటా మోటార్స్ సంస్థ తమ పాత, ఐకానిక్ మోడల్ సియెర్రాను మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది. 1990లలో సంచలనం సృష్టించిన ఈ ఎస్‌యూవీకి చెందిన కొత్త వర్షెన్​ని తాజాగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త సియెర్రా ఎస్​యూవీ.. ఆధునిక డిజైన్ అంశాలను, అలాగే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది.

అధికారిక లాంచ్​కి ముందే, టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని కాన్సెప్ట్ వెర్షన్ నుంచి ప్రీ-ప్రొడక్షన్ డిజైన్ వరకు వివిధ దశల్లో ఎన్నో సందర్భాలలో ప్రదర్శించింది. అయితే, నవంబర్​ 25 లాంచ్​కి ముందు, ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా సియెర్రా ఎస్​యూవీ దాని పాత మోడల్ స్ఫూర్తితోనే బాక్సీ డిజైన్‌ను పొందింది. అయితే దీనికి సమకాలీన రూపాన్ని ఇవ్వడానికి పలు కొత్త అంశాలను జోడించారు.

అప్‌రైట్...