భారతదేశం, అక్టోబర్ 31 -- నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే బాలయ్య కూతురు స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. అతని చిన్న కూతురు తేజస్విని ఈ మధ్యే సిద్ధార్థ జువెలర్స్ యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ ను ఆమెనే తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనిని చూసిన ఓ అభిమాని అచ్చూ రకుల్‌ప్రీత్ సింగ్ లా ఉన్నావని కామెంట్ చేయడం విశేషం.

నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నటించిన ఓ కమర్షియల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. "నా తొలి ఆన్ స్క్రీన్ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, కౌస్తుబా హై జ్యువెలరీ డిజైన్ స్టూడియోతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.

దీన్న...