భారతదేశం, ఆగస్టు 24 -- కాకినాడ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు విచారణలో కీలక పురోగతి లభించింది. ఈ దారుణ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు, రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ విషాద ఘటనలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ రెడ్డి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో చిన్నారి రియాన్స్ రెడ్డి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, నూకరాజు, మీనా, సౌజన్య నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మొదట ఈ ఘటనపై రాజమహేంద్రవరంలో కేసు నమోదవ్వగా, ఘటన వెనక ఉన్న అసలు కారణాలు విచారణలో బయటపడ్డాయి.

పోలీసులు జరిపిన తనిఖీల్లో రెండు వ...