భారతదేశం, ఆగస్టు 10 -- సంవత్సరంలో వచ్చే 24 ప్రదోష వ్రతాల పుణ్యఫలాన్ని కేవలం ఒక్క ప్రత్యేకమైన ప్రదోష రోజున ఎలా పొందాలో తెలుసుకోండి. సోమ ప్రదోష వ్రత శుభ ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

హిందూ సంప్రదాయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలలో వచ్చే త్రయోదిశి తిథిని ప్రదోష వ్రతంగా ఆచరిస్తారు. కృష్ణ పక్షం, శుక్ల పక్షం చొప్పున ప్రతినెలా రెండుసార్లు ఈ వ్రతం వస్తుంది. సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం త్రయోదశి తిథి, ప్రదోష కాలం కలిసివచ్చే సమయం మహాదేవుని పూజకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

ఏడాదికి మొత్తం 24 ప్రదోష వ్రతాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అధిక మాసం వస్తే ఈ సంఖ్య 25 లేదా 26కి చేరుకుంటుంది. ప్రతి వ్రతానికి దాని ప్రత్యేకత ఉన్నప్పటికీ, అన్ని ప్రదోష వ్రతాల ఫలితాన్ని ఒకే ఒక వ్రతంత...