భారతదేశం, ఆగస్టు 7 -- ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్​) దాఖలు చేయడానికి చివరి తేదీ (సెప్టెంబర్ 15) దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ పత్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి చార్టెడ్ అకౌంటెంట్ లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, చాలా మంది వారంతటవారే ఐటీఆర్ దాఖలు చేస్తుంటారు. ముఖ్యంగా యువ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు తమ వార్షిక ఆదాయం, పన్ను బాధ్యతలను సొంతంగా లెక్కించుకుని ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు. అయితే, ఇలా చేసే ముందు కొన్ని విషయాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఈ ప్రక్రియలో ఉపయోగపడే 10 ముఖ్యమైన కీలక పదాలు ఇక్కడ ఉన్నాయి.

I. స్థూల ఆదాయం (Gross Income): పేరుకు తగ్గట్టుగానే, ఇది ఒక సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. ఇందులో జీతం, ...