Hyderabad, ఆగస్టు 21 -- చంద్ర గ్రహణం 2025 రాశిఫలాలు: ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 07న జరుగుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలోని పూర్వ భాద్రపద నక్షత్రంలో జరగబోతోంది. గ్రహణ కాలంలో కుంభరాశిలో సూర్య చంద్రుల కలయిక ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం ఖగోళ సంఘటన అయినప్పటికీ, కొన్ని రాశులపై కూడా ప్రభావం చూపుతుంది.

జ్యోతిష లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపుతుందని, ఈ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. దీనితో పాటు సంపద పెరిగి భూమి, భవనం, వాహనం లభిస్తాయి. సెప్టెంబర్ లో వచ్చే చంద్రగ్రహణం వల్ల ఏయే రాశుల వారిపై ప్రభావం ఉంటుందో తెలుసుకోండి.

1. మేష రాశి - మేష రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం వల్ల ఆకస్మిక ధనం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంది. పెట్టిన పెట్టుబడి త్వరగానే వస...