Hyderabad, సెప్టెంబర్ 16 -- గ్రహాల సంచారంలో మార్పు రావడంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది మనపై ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయితే గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటుంటారు.

సెప్టెంబర్ 17 అంటే రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులు పాటు సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. దీంతో రవి బలం పెరిగే కొన్ని రాశుల వారు రాజయోగంతో సంతోషంగా ఉంటారు. చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి.

సూర్యుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సెప్టెంబర్ 17న ప్రవేశిస్తాడు. దీనితో ప్రధానంగా నాలుగు రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. రవి బలం వలన రాజయోగం పట్టడంతో ఈ రాశుల వారి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మ...