Hyderabad, సెప్టెంబర్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. ఇదిలా ఉంటే, గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు సెప్టెంబర్ 17న కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆ రోజు "కన్య సంక్రాంతి" అని అంటారు.

ఇదిలా ఉంటే, అదే రోజు పితృపక్షంలో ముఖ్యమైన ఇందిరా ఏకాదశి. ఆ రోజూ చాలా మంది పితృదేవతల అనుగ్రహం పొందడానికి వివిధ రకాల పరిహారాలను పాటిస్తారు. పితృ దేవతల అనుగ్రహం ఉంటే కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండొచ్చు. ఏ విధమైన లోటు ఉండదు.

ఆ రోజు దేవశిల్పి విశ్వకర్మ భగవంతుడిని కూడా ఆరాధిస్తారు. ఆయనను ఆరాధించడం వలన వ్యాపారం అభివృద్ధి జరుగుతుందని నమ్మకం. పైగా సెప్టెంబర్ 17న పుష్య యోగం కూడా ఏర్పడుతోంది. ఇది ఉదయం 6:26 కి ప్రారంభమవుతుంది. ఇలా ఇవన్నీ కలిసి రావడం...