Hyderabad, సెప్టెంబర్ 11 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని పిల్లాపాపలతో ఇల్లు కళకళ్లాడాలని భావిస్తారు. కానీ కొంత మంది సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే విధంగా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పులతో సతమతమవుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసిన అప్పులు తీరవు. అయితే సంతానం కలగాలన్నా, అప్పులు బాధల నుంచి బయటపడాలన్న సెప్టెంబర్ 13 చాలా ముఖ్యమైనది. సెప్టెంబర్ 13 చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. సెప్టెంబర్ 13న షష్టి పైగా కృత్తిక నక్షత్రం వస్తుంది.

కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం. సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం. అదే రోజు షష్టి రావడం మరింత విశేషం. కృత్తికా నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడం వల్ల, ఈ రోజున సంతానాన్ని ప్రసాదించడానికి ఆయన పూర్తి అనుగ్రహాన్ని పొందడానిక...