భారతదేశం, సెప్టెంబర్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని భోగభాగ్యాలు, ఐశ్వర్యం, ప్రేమ, లలిత కళలకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. అందుకే శుక్రుడి సంచారానికి జ్యోతిష్య రంగంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఎప్పుడూ ఒకే స్థానంలో ఉండని ఈ గ్రహం, నిర్ణీత సమయానికి తన రాశిని, నక్షత్రాన్ని మారుస్తుంటుంది. ప్రస్తుతం తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచరిస్తున్న శుక్రుడు, త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సెప్టెంబర్ 11, 2026 నాడు శుక్రుడు చిత్తా నక్షత్రం నుంచి రాహువు ఆధిపత్యం వహించే స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు.

అక్టోబర్ 23 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. రాహువు నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి అసాధారణమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బల...