భారతదేశం, ఆగస్టు 31 -- సెప్టెంబర్ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఈ గ్రహాల సంచారం వల్ల మేషం, మిథునం, కన్య, తులా మరియు మకర రాశుల వారికి కెరీర్, ఆర్థిక రంగాల్లో ఊహించని లాభాలు దక్కనున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైన ఖగోళ మార్పులకు వేదిక కానుంది. నెల ప్రారంభం నుంచే గ్రహాల గమనంలో వేగం పుంజుకోనుంది. ఈ నెలలో సంపద, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు, బుద్ధి ప్రదాత బుధుడు, ఆత్మకారకుడు సూర్యుడు, పరాక్రమ కారకుడు కుజుడు వంటి నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఈ గ్రహాల గమన మార్పుల ప్రభావం ద్వాదశ రాశులపై విభిన్న రీతిలో పడనుంది.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సెప్టెంబర్ నెల తొలి ఘట్టంగా సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. జ్యోతిషంలో తులా రాశి శుక్రుడికి స్వక్షేత్రం కా...