భారతదేశం, డిసెంబర్ 11 -- యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన మరో మూవీ మోగ్లీ. ఈ సినిమా శనివారం (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డును క్షమాపణ కోరింది. ఆ సెన్సార్ బోర్డు ఆఫీసర్ తన నటన చూసి భయపడిపోయాడట అని మూవీలో విలన్ పాత్ర పోషించిన బండి సరోజ్ చేసిన కామెంట్స్ తో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గురువారం (డిసెంబర్ 11) మోగ్లీ మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. సెన్సార్ బోర్డు, సెన్సార్ ఆఫీసర్ కు క్షమాపణ చెబుతున్నట్లు అందులో ఉంది. "మా నటుడు బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా వచ్చినవే. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉంది. బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో కంటెంట్‌ను పర్యవేక్షించే బోర్డు పాత్రను మేము ఎంతగానో గౌరవిస్తాం...