భారతదేశం, ఆగస్టు 2 -- జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా కొలుస్తారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ప్రభుత్వ ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలకు కారకుడైన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాబోయే ఆగస్టు 17, 2026 న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

గ్రహాల రాశి మార్పు మానవ జీవితాలపై, వివిధ రాశుల జాతకులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం, ఈ సూర్య గోచార ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ.. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఇది అద్భుతమైన కాలంగా మారనుంది. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, సమాజంలో గుర్తింపు కోరుకునే వారికి ఈ సమయం కలిసొస్తుంది. ఆ ఆరు అదృష్ట రాశుల వివరాలు ఇలా ఉన్నాయి.

మేష రాశి వారికి సూర్య సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో కీలక బాధ్య...