భారతదేశం, జూన్ 3 -- మన హిందూ సంప్రదాయంలో దానధర్మాలకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది. పురాణాలు, శాస్త్రాల ప్రకారం దానాలు చేయడానికి కొన్ని నియమాలు, సమయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కచ్చితంగా పాటించేటట్టు చూడాలి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో దానం చేయడం వలన పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఈ విషయంలో హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు. దాని వలన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోతుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది. సాయంత్రం వేళ ప్రదోషకాలంలో పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకండి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ ఐదు వస్తువులను ఇతరులకు ఇస్తే దరిద్రం తప్పదు అని గుర్తుపెట్టుకోండి.

పసుపును హిందూ సంప్రదాయంలో ఎంతో పవ...