Hyderabad, సెప్టెంబర్ 20 -- రేపే సూర్య గ్రహణం. సూర్య గ్రహణం వేళ సంసప్తక యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది వచ్చే చివరి సూర్యగ్రహణం కూడా కన్యరాశిలో ఏర్పడనుంది. ఇది ఇలా ఉంటే శని మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని మీన రాశిలో ఉండడం, సూర్యుడు కన్య రాశిలో ఉండడం వలన సంసప్తక యోగం ఏర్పడనుంది.

అయితే, సూర్యగ్రహణం, సంసప్తక యోగం రెండూ కూడా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కెరీర్‌లో సక్సెస్‌ని అందుకుంటారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. మరి ఈ యోగం ఏ రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది? ఏ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులు కెరీర్‌లో స...