భారతదేశం, నవంబర్ 16 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఈరోజు చాలా విశేషమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల చాలా రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకోవడం కారణంగా యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. అటువంటి యోగాల్లో ఒకటే నవపంచమ యోగం. ఈరోజు ఈ యోగం ఏర్పడింది. ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల శని గ్రహంతో నవపంచమ యోగాన్ని ఏర్పరచాడు.

ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వ భావన ఉన్నప్పటికీ, వీటి కలయిక నవపంచమ యోగాన్ని తీసుకొస్తుంది. ఇది శుభప్రదమైనది కూడా. 12 రాశుల వారిపై నవపంచమ యోగం ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వా...