Hyderabad, ఆగస్టు 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మార్పు చెందుతాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు, శని దేవుడికి ఏంతో ప్రత్యేకత ఉంది. గ్రహాలకు రాజు సూర్యుడు, న్యాయానికి కర్మలకు అధిపతి శని. ఈ రెండు గ్రహాలు రాఖీ పండుగ నాడు ఒకదానికొకటి వరుసగా పంచమ, 9వ స్థానంలో ఉంటాయి. దీంతో నవ పంచమ యోగం ఏర్పడుతుంది.

ఈ రాజయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారు. సూర్య-శని సంయోగం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరికి ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఈ రెండు గ్రహాల నవ పంచమ యోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. దీంతో జీవితంలో సమస్యలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఊహించిన ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు కలిసి వస్తుంది. శుభక...