భారతదేశం, డిసెంబర్ 12 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం రేపిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ఈ సిరీస్ కు మేకర్స్ ముగింపు పలకబోతున్నారు. చివరిదైన నాలుగో సీజన్ ను వచ్చే శుక్రవారం (డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది గతంలోని మూడు సీజన్లలాగే చాలా బోల్డ్ గా సాగిపోయింది.

బోల్డ్ కంటెంట్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్‌తో యూత్‌ను ఆకట్టుకున్న 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఫైనల్ సీజన్ ట్రైలర్ ఫుల్ ఎనర్జీతో, కాస్త ఎమోషనల్ టచ్‌తో విడుదలైంది. ఈసారి ఈ నలుగురు ఫ్రెండ్స్ (దామిని, ఉమంగ్, అంజన, సిద్ధి) తాము మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయడానికి, తమ సమస్యల నుంచి బయటపడటానికి సిద్ధమవడం ఇందులో చూడొచ్చు.

తమ జీవితాలను వెనక్కి లాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ నలుగు...