Hyderabad, జూలై 6 -- సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్‌ తాజాగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

రామ్ గోధల దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ఓ భామ అయ్యో రామ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. శనివారం (జులై 5) ఓ భామ అయ్యో రామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ.. "ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్‌...