భారతదేశం, సెప్టెంబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫస్ట్ వీకెండ్ కు టైమ్ ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లోనే హోస్ట్ నాగార్జున రాబోతున్నారు. ఈ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఓనర్లు, టెనెంట్స్ అంటూ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు జరుగుతోంది. మరి బిగ్ బాస్ తెలుగు 9లో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేటర్ అవుతారన్నది తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది.

సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లోకి కంటెస్టెంట్ గా వచ్చారు. కానీ ఆయన హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మిగతా కంటెస్టెంట్లతో అంత త్వరగా కలవలేకపోయారు. ఈ కారణంతోనే సుమన్ శెట్టిని నామినేట్ కూడా చేశారు. అప్పటి ట్రెండ్ చూస్తే సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ లోనే ఇంటికి వెళ్లిపోతారని అనిపించింది. కానీ ఆడియన్స్, ఫ్యాన్స్ ఆయనకు ...