భారతదేశం, అక్టోబర్ 6 -- సుప్రీంకోర్టులో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది! భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై ఓ న్యాయవాది దాడికి యత్నించినట్టు సమాచారం.

పలు నివేదికల ప్రకారం.. కోర్టు విచారణ సందర్భంలో సదరు న్యాయవాది డయాస్​ వైపు దూసుకెళ్లారు. అనంతరం సీజేఐ జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై దాడి చేసే ఉద్దేశంతో తన షూని తీశారు.

అదే సమయంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని, అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.

"సనాతన ధర్మానికి అగౌరవం జరగకుండా చూసుకుంటా," అని ఆ న్యాయవాది అరుస్తూ, బయటకు వెళ్లారు.

ఇంత జరిగినప్పటికీ సీజేఐ జస్టిస్​ గవాయ్​ తన ఏకాగ్రతను కోల్పోలేదు.

"ఇలాంటి వాటిని పట్టించుకోకండి. మనం మన దృష్టిని మరల్చకూడదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు," అని సీజేఐ చాలా ప్రశాంతంగా స్పందించారు.

అనంతరం కోర్టు కార్యకలాపాలను క...